బిగ్ బాస్ ఎపిసోడ్ లో సమంత లుక్ అందరినీ ఆకర్షించింది.ముఖ్యంగా సమంత కట్టుకున్న చీర గురించి అయితే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. క్షితిజ్ జలోరి అనే డిజైనర్ డిజైన్ చేసిన చీరను సమంత కట్టుకున్నారు.  ఈ చీర ధర 44,800 రూపాయలు. క్షితిజ్ జలోరి ఈ చీరను డిజైన్ చేయగా, ప్రముఖ స్టైలిస్ట్ పల్లవి సింగ్ సమంత లుక్ ని స్టైలింగ్ చేశారు.అలా బిగ్ బాస్ హౌస్ లో తన అందం, చక్కటి అభినయంతో.. మరియు తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఈ అక్కినేని వారి కోడలు