వినాయక్.. ఎన్టీఆర్, చరణ్ లతో ఇప్పటికే సినిమాలు చేసాడు.   అందుకే ఆ ఇద్దరిపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. అతడి మాటంటే మాటే. మాటిస్తే ఇక రాయల్ తీరుగానే ఉంటాడు అని వినాయక్ ప్రశంసించారు. తన తండ్రికి రోల్స్ రాయిస్ కొనాలని ఉందని అంటే వెంటనే బర్త్ డేకి గిఫ్ట్ గా కొనిచ్చాడని .. మరో బర్త్ డేకి సైరాను గిఫ్ట్ గా ఇచ్చాడని వినాయక్ అన్నారు. చిరు చిత్రం 'సైరా' నిర్మాణ సమయంలో రామ్ చరణ్ తన తారాగణం సిబ్బంది కోసం మంచినీళ్లలా డబ్బు ఖర్చు చేశారని తెలిపారు.అతను తన టీమ్ లోని ప్రతి ఒక్కరూ విదేశాలలో ఉన్నప్పుడు తగినంత డబ్బు ఉండేలా చూసుకున్నాడు.వారితో సమానంగా ప్రవర్తించాడు. రామ్ చరణ్ ఒక దర్శకుడికి ఒక మాట ఇస్తే ఆ దర్శకుడు అపజయంలో ఉన్నా..తన మాటను వెనక్కి తీసుకోడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు వినాయక్.జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్థావిస్తూ.. అతడు అసాధారణమైనవాడని.. తెలివైనవాడు అని కితాబిచ్చారు వినయ్. ఈ తరం నటులలో చాలామందికి లేని పనితీరు సామర్థ్యాలు ఎన్టీఆర్ కి ఉన్నాయి అని పొగిడేశారు.