తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్(55) ఈరోజు మృతి చెందారు. దీంతో అటు కొలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ విషాద ఛాయలు అల్లుకున్నాయి. కోలా భాస్కర్ చాలా కాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతూ వచ్చారట. గతకొద్ది రోజుల నుండీ కోలుకుంటున్నట్టు కనిపించినా.. మళ్ళీ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చిన ఆయన ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచినట్టు సమాచారం.