ఇటీవల తేజూ నటించిన  'ప్రతిరోజూ పండగే' సినిమా  ఘన విజయాన్ని సాధించింది.' ప్రతి రోజూ పండగే'తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందుకుని వార్తల్లో నిలిచారు.  గత ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. మిక్స్ డ్ టాక్ తోనే బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. అందుకే.. ఈ లక్కీ డేట్ కే తన నెక్స్ట్ వెంచర్ ని ఫిక్స్ చేసేశారట తేజ్.ఆ వివరాల్లోకి వెళితే.. నూతన దర్శకుడు సుబ్బు కాంబినేషన్ లో సాయితేజ్ నటించిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'.నభా నటేష్ నాయికగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని తొలుత మే 1న రిలీజ్ చేయాలనుకుంది చిత్ర బృందం. అయితే కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు.  లాక్ డౌన్ ముగిశాక రీసెంట్ గా ప్యాచ్ వర్క్ ని సైతం ఫినిష్ చేసిన యూనిట్.. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక బిగ్ స్క్రీన్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోందట.అందులో భాగంగానే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.