పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నది. హైదరాబాద్ లోని మియాపూర్ ఏరియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ మాదాపూర్ లోని మెట్రో రైలు ఎక్కారు. అక్కడి నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరుకొని షూటింగ్ స్పాట్ కి వెళ్లనున్నారు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవన్ కళ్యాణ్, గతంలో ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.