హీరో రాజశేఖర్ ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడుతోందనే వార్తలు ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది ప్రముఖులు కరోనా తర్వాత వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజశేఖర్ కూడా దాదాపుగా పోస్ట్ కొవిడ్ సమస్యలతోనే సతమతమయ్యారు. ఇప్పుడు ఆ సమస్యలన్నిటినీ వైద్యులు చికిత్స ద్వారా నయం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొన్ని రోజుల్లో రాజశేఖర్ పూర్తిగా కోలుకుని ఆస్పత్రినుంచి డిశ్చార్జి అవుతారు.