మిస్ ఇండియా మూవీ ప్రమోషన్లో భాగంగా కీర్తి సురేష్ ట్విట్టర్లో ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నడిపింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెదకడం తాను క్వారంటైన్ కాలంలో నేర్చుకున్నట్టు తెలిపింది కీర్తి సురేష్. ఇక లాక్ డౌన్ కాలంలో కీర్తి సురేష్ బాగా బరువు తగ్గింది. చాలామంది ఈ విషయంపైనే ఆమెను ప్రశ్నలు అడిగారు. ఇంత తక్కువ టైమ్ లో ఎలా బరువు తగ్గారు, స్లిమ్ గా అవడానికి మీకు ప్రేరణ ఎవరు అని ప్రశ్నించారు. బరువు తగ్గడానికి తాను బాగా వర్కవుట్స్ చేశానని, డైటీషియన్ సలహాలతో ఫుడ్ హ్యాబిట్స్ పై కంట్రోల్ పెట్టానని చెప్పింది కీర్తి సురేష్.