తాజాగా రాజమౌళి ఎన్టిఆర్- చరణ్ లపై అభిమానుల్ని మంత్రముగ్దులను చేసే పోరాట సన్నివేశాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట. దర్శకధీరుడు రాజమౌళి మొదట చరణ్ ..ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ కొనసాగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటి వరకు భారీ పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశంలో ఎన్టీఆర్ - చరణ్ ఇద్దరిపైనా యాక్షన్ పార్ట్ ని పీక్స్ లో ఉండేలా షూట్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ చిత్రానికి హైలైట్ అవుతుందన్న గుసగుసలు కూడా ఇండ్రస్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సన్నివేశం బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కీలకమైన భాగంలో వస్తుంది. అలాగే కొమరం భీమ్ తో అల్లూరి సీతారామరాజు పరిచయం సీన్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని యాక్షన్ పార్ట్ తో రకరకాల ట్విస్టులు పరిచయం అవుతాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.