మెగాస్టార్ కు కూడా వినాయక్ డైరెక్షన్లోనే చెయ్యాలని ఉంది. అయితే స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా ఆయన సంతృప్తి చెందలేదని వినికిడి. వినాయక్ కంటే బెటర్ గా మరో దర్శకుడు ‘లూసిఫర్’ స్క్రిప్ట్ ను రెడీ చేస్తారేమో అని చిరు అన్వేషిస్తున్నారట. అలా లేని పక్షంలో కచ్చితంగా వినాయక్ తోనే సెట్స్ పైకి వెళ్లిపోవాలని ఆయన భావిస్తున్నారట. అందుకే వినాయక్ పుట్టినరోజు నాడు కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వలేదని తెలుస్తుంది.