సంక్రాంతి సీజన్ సినీ నిర్మాతల్ని బాగానే ఊరిస్తోంది. అయితే ప్రేక్షకులు వస్తారా రారా అనేదే డౌట్. థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు ధైర్యం చేసి బైటకు ఒకవేళ వచ్చినా చిన్నారులు, వృద్ధులకు ప్రవేశం లేదు అంటే.. ఫ్యామిలీలు అటువైపు చూసే అవకాశం ఉందడు. ఫ్యామిలీలు రాకపోతే.. యూత్ మాత్రమే సినిమాకి మహారాజ పోషకులవుతారు. ఇలాంటి టైమ్ లో యూత్ ఫాలోయింగ్ ఉన్న సినిమా 'లవ్ స్టోరీ'కి సంక్రాంతి మంచి సీజన్ లా కనిపిస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ కి తోడు.. దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా కావడంతో 'లవ్ స్టోరీ'పై భారీ అంచనాలున్నాయి.