జక్కన్నతో మగధీర తర్వాత డిఫరెంట్ స్టైల్లో ఆరెంజ్ మూవీ చేసి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు చరణ్. ఇప్పుడు కూడా అలా కాకూడదని ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు చెర్రీ.అయితే రామ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ కథలు ప్రస్తుతం ఇప్పటి వరకు మరే దర్శకుడు రీచ్ కాలేదని టాక్. పాన్ ఇండియా టార్గెట్‌గా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత, అదే రేంజ్లో కథతోనే సినిమా చేయాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  అయితే ప్రస్తుతం ఆయన దగ్గరకు లోకల్ కమర్షియల్ స్క్రిప్ట్‌లు మాత్రమే వచ్చాయట. దీంతో వాటిని మొహమాటం లేకుండా తిరస్కరిస్తూ.. పాన్ ఇండియా స్క్రిప్ట్‌తో వచ్చే దర్శకులకు సినిమా ఓకే చేస్తానని ఆఫర్ ఇచ్చారట. దీంతో ప్రస్తుతం కొందరు రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఈ మెగా హీరో కోసం పాన్ ఇండియా కథను చెక్కే పనిలో ఉన్నారని తాజాగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.