కీర్తి సురేష్ చేస్తున్న సర్కారు వారి పాటపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు సినిమా కావడం వల్లే ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇటీవల మిస్ ఇండియా ప్రమోషన్ లో భాగంగా సర్కారు వారి పాట సినిమా కోసం చాలా ఎగ్జైట్ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. నటనకు బాగా ఆస్కారం ఉన్న పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుందట. ఇక ఈ పాత్ర కోసం తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నట్లుగా కూడా కీర్తి చెప్పింది. మొత్తానికి ఈ సినిమాతో తన స్టార్ డమ్ పెంచుకుని, ప్లాప్ ల భారం తగ్గించుకునేందుకు కీర్తి సురేష్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.