60కోట్ల బడ్జెట్లో బాలయ్య-బోయపాటి సినిమాను తెరకెక్కనుందట. దీనిలో బాలయ్య.. బోయపాటిలకే దాదాపు 25కోట్లు పోతుంది. మిగతా బడ్జెట్లో సినిమాను తెరకెక్కించాలంటే దర్శకుడికి కత్తిమీద సాములా మారింది. దీంతో దర్శకుడు స్టార్ హీరోయిన్లు.. నటీనటుల జోలికి వెళ్లకుండా తక్కువ రేటులో వచ్చే వారితోనే సినిమాను కానిచ్చేస్తున్నాడని తెలుస్తోంది.బాలయ్యకు జోడి నటించే హీరోయిన్ల విషయంలోనూ బోయపాటి ఇలానే చేయడం చర్చనీయాంశంగా మారింది. బాలయ్య సినిమాలో స్టార్ హీరోయిన్లకు కాకుండా తక్కువ పారితోషికం తీసుకునే వారికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్యకు జోడీగా ప్రయాగ మార్టిన్ అనే కొత్త అమ్మాయికి ఛాన్స్ ఇవ్వగా ఆమెకు కేవలం 20లక్షలు ఇవ్వనున్నారట.  ఇక మరో హీరోయిన్ గా పూర్ణను తీసుకోగా ఆమెకు కేవలం 12లక్షలు ఇవ్వనున్నారని సమాచారం.బాలయ్య సినిమాలో స్టార్ హీరోయిన్లను పెడితే ఒక్కో హీరోయిన్ కు కోటిపైనే చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ రేటులో హీరోయిన్లను తీసుకోవడం ద్వారా బడ్జెట్ మిగిల్చి ఆ డబ్బులను సినిమా మేకింగ్ పై ఖర్చు చేయాలని భావిస్తున్నాడు. హీరోయిన్లతోపాటు నటీనటుల విషయంలోనూ బోయపాటి ఇలానే చేస్తున్నాడట.