సాధారణంగా తన వ్యక్తిగత ఫోటోలను చాలా తక్కువగా షేర్ చేసుకునే కాజల్ అగర్వాల్ పెళ్లయిన తర్వాత విపరీతంగా ఫోటోలను షేర్ చేస్తూ తెగ రెచ్చిపోతున్నారు. తన నిశ్చితార్థానికి ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. “కర్వా చౌత్”  పండుగ రోజున దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఆమెకు ఒక్క ఇన్ స్టాగ్రామ్ ఖాతాలోనే ఒక కోటి 60 లక్షల మంది ఫాల్లోవర్లు ఉన్నారు.