నాగార్జున, దియామీర్జా జంటగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ సినిమాలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మ అనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారు. ఇప్పుడీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిపోయింది. 60ఏళ్ల వయసులో అక్కడ యువ నటీనటులతో కలసి నాగార్జున బాగా ఎంజాయ్ చేశారట. వారితో పోటీపడి మరీ రిస్కీ షాట్స్ చేశారట. నాగార్జున ఉత్సాహం చూసి యువ నటీనటులు ఆశ్చర్యపోయారట. ఈ విషయాలన్నీ చిత్ర యూనిట్ వెల్లడించింది.