తాజాగా కాజల్ స్వయంగా తన లవ్ స్టోరి గుట్టు విప్పేసారు. తాను గౌతమ్ తో మూడేళ్లుగా డేటింగ్ చేశానని పెళ్ళికి ముందు 7 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నామని కాజల్ వెల్లడించారు. గౌతమ్ తో తన అనుబంధం కొన్నేళ్లుగా ఎలా బలపడిందనే దాని గురించి తాజా ఇంటర్వ్యూలో కాజల్ ప్రతిదీ రివీల్ చేశారు.  "గౌతమ్ ఒక స్నేహితుడిగా సాధారణ యువకుడిగా నా హెచ్చు తగ్గులు చూశాడు.నిజానికి అతడికి నటిగా కంటే ఒక వ్యక్తిగానే నేను సుపరిచితం. గౌతమ్ కాకుండా వేరొకరితో నా జీవితాన్ని ఊహింలేను" అని కాజల్ అన్నారు.అలాగే పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కాజల్ చెప్పారు. కెరీర్ ని మించి హ్యాపీ లైఫ్ కే ప్రాధాన్యత ఉంఉందని వెల్లడించారు.