RRR  షెడ్యూల్ మొదలైన దగ్గరనుంచీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఇంటికెళ్ళలేదట ఎన్టీయార్ . జస్ట్ గంట లోపు జర్నీ చేస్తే ఇల్లు చేరుకోవచ్చు. అయినా తారక్ అజ్ఞాతవాసంలోనే ఉన్నారట.ఇంట్లో ఇద్దరు పిల్లలు.. వయసు ఎక్కువ వున్న తల్లి..! అందుకే.. ఫిజికల్ డిస్టెన్స్ అనే గైడ్ లైన్ ని కంపల్సరీగా పాటిస్తున్నారు ఎన్టీయార్.  మన వల్ల మరొకరికి రిస్క్ రాకూడదన్న కమిట్మెంట్ ఆయన్ను అలా కట్టిపడేసింది. గతంలో రాత్రికల్లా లొకేషన్ నుంచి ఇంటికొచ్చి వాలిపోయి.. పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఎన్టీయార్ కి ఉన్న అలవాటు. ఇప్పుడు కరోనా భూతమొచ్చి తన ఫామిలీ తో గడపకుండా చేస్తోందట. వీడియో కాల్స్ తో తల్లీ, భార్య, పిల్లలతో మాట్లాడుతూ స్పెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే తన భార్య, పిల్లలతో పాటు, తన తల్లిని కూడా చాలా మిస్సవుతున్నానని ఫీల్ అవుతున్నాడట తారక్.