రాహుల్ సాంకృత్యయాన్ దర్శకత్వంలో వస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నాని సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. సాయిపల్లవి, కృతి శెట్టి ఇందులో హీరోయిన్లు. వెంకట్ బోయిన్పల్లి నిర్మిస్తున్న ఈ సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ముందుగా కోల్‌కతాలోనే ఈ సినిమా తీయాలనుకున్నారు కానీ, అనుకోని కారణాలతో అది వాయిదా పడింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కోల్ కత సెట్టింగ్ వేసి సినిమా షూటింగ్ చేయబోతున్నారు.