కమల్  రజినీ అనారోగ్యం పై స్పందిస్తూ… “నా ప్రియమిత్రుడు రజనీకాంత్ ఆరోగ్యంగా ఉండడమే నాకు ముఖ్యం. రాజకీయాలు అనేవి తరువాత..! ముందు ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను.ఎన్నికలు వచ్చేటప్పుడు నేను రజనీ మద్దతు కోరుతాను. అందులో అనుమానమే లేదు. అయితే.. రజినీ తన సొంత పార్టీని ప్రారంభించాలి అనుకుంటే… అది పూర్తిగా ఆయన ఇష్టం. అలాంటి విషయాల పై స్పందించడం అలాగే విమర్శలు చెయ్యడం అనేది ఇప్పుడు సరైనది కాదు” అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.