పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని మియాపూర్ ఏరియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ కోసం మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. ఒక సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణం చేసి, అందులో ప్రయాణికులను పలకరించారు. మెట్రో పనితీరు అడిగితెలుసుకున్నారు.  పవన్ కళ్యాణ్ మెట్రో రైల్లో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ తో పాటుగా చిత్ర యూనిట్ కూడా మెట్రో రైల్లో ప్రయాణం చేసింది. పవన్ కళ్యాణ్ మెట్రో రైల్లో ప్రయాణం చేసింనందుకు మెట్రో యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.