గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలో తమిళనాడు మరియు మహారాష్ట్ర లలో థియేటర్స్ కు ఆడియెన్స్ ను రప్పించేందుకు 'బాహుబలి' ఫ్రాంచైజీని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.  ఇప్పటికే హిందీ వెర్షన్ 'బాహుబలి - ది బిగినింగ్' ని మహారాష్ట్ర థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. 'బాహుబలి- కన్క్లూజన్' ను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నారు. అలానే తమిళనాడు థియేటర్స్ లో రజనీకాంత్ సినిమాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన 'బాహుబలి' రెండు పార్ట్స్ వేస్తున్నట్లుగా సమాచారం.కచ్చితంగా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తే జనాలు వస్తారని భావిస్తున్నారు అక్కడి థియేటర్ యాజమాన్యాలు.