బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న విషయం తెలిసిందే. బాలయ్యకు జోడీగా మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్‌ను ఎంపిక చేసారు. ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి స్క్రీన్ టెస్ట్ కూడా ఇచ్చింది ప్రయాగ.కానీ 25 ఏళ్ల అమ్మాయి కావడం.. బాలయ్య పక్కన మరీ చిన్న పిల్లలా అనిపించడంతో ఆయనకు సరిపోదని భావిస్తున్నారు. దానికితోడు ట్రోలింగ్ కూడా భారీగానే జరుగుతుంది. అందుకే ప్రయాగను పక్కనబెట్టి మరో హీరోయిన్ వైపు బోయపాటి అడుగులు పడుతున్నాయి. అమల పాల్ ను ఇందులో బాలయ్యకు జోడీగా తీసుకుంటున్నాడు బోయపాటి శ్రీను.తెలుగులో ఈ అమ్మడికి మంచి క్రేజే ఉంది. గతంలో ఈమె అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో.. రామ్ చరణ్ నాయక్ సినిమాల్లో నటించింది.  ఇప్పుడు నందమూరి సీనియర్ హీరోతో నటించడానికి సిద్దం అయ్యింది