అక్కినేని అఖిల్ పెళ్లి వార్తలు మరోసారి ప్రముఖంగా వినిపిస్తిన్నాయి. గతంలో పెళ్లి వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లి క్యాన్సిల్ కావడంతో మూడ్ ఆఫ్ లో ఉన్న యువహీరో.. ఎట్టకేలకు తిరిగి పెళ్లికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అఖిల్ ని తిరిగి అందరితోనూ కలసిపోయేట్టు చేయాలంటే పెళ్లి చేయాలని నాగార్జున డిసైడ్ అయ్యారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది అఖిల్ వివాహం జరగబోతుందని చెబుతున్నారు. అయితే అది ప్రేమ వివాహమా, లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది.