అనుష్క, ప్రభాస్ మంచి స్నేహితులే కానీ, అంతకు మించి వారి మధ్య ఏదే లేదని గతంలోనే పలుమార్లు స్పష్టం అయింది. ఇటీవల అనుష్క కూడా సోషల్ మీడియాలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో అలాంటి పుకార్లను మరోసారి కొట్టిపారేసింది. అయితే స్నేహం కోసమే ప్రభాస్, అనుష్క పుట్టినరోజు కోసం వచ్చారని, ఆయన సమక్షంలోనే అనుష్క పుట్టినరోజు వేడుకలు జరిగాయని చెబుతున్నారు. అయితే ఆ ఫొటోలు మాత్రం ఇంతవరకు బైటకు రాలేదని కొన్ని వెబ్ సైట్లు వార్తలు ఇస్తున్నాయి. మొత్తమ్మీద అటు అనుష్క కానీ, ఇటు ప్రభాస్ కానీ ఈ పుట్టినరోజు వ్యవహారంపై స్పందించలేదు.