‘నిశ్శబ్దం’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యి ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రెండేళ్ల తరువాత అనుష్క నుండీ వచ్చిన చిత్రం కాబట్టి.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగానే చూసారు. అయితే సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ.. ‘జీ తెలుగు’ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను రూ.8కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.