ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంబంధించి ఒక యాక్షన్ బ్లాక్ ఉంది. ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఖర్చుచేయడానికి రెడీ అవుతున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నారు.