సూపర్ హిట్ సినిమాలు తీయడంలోనే కాదు, అద్భుతంగా యాడ్స్ రూపొందించడంలో కూడా త్రివిక్రమ్ కు మంచి పట్టుంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసిన యాడ్స్ ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీతో ఆహా కోసం నాలుగైదు యాడ్స్ రూపొందించే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. అలవైకుంఠ పురములో తర్వాత అలా.. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి సెట్ అయింది.