వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం'బాక్సర్'.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వరుణ్ తన తాజా సినిమా 'బాక్సర్' కోసం రాత్రి రెండు దాటుతోన్నా సెట్స్‌లోనే ఉన్నారు.  దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. కాగా వైజాగ్‌లో ప్లాన్ చేసిన ఈ సినిమాలోని కీలక షెడ్యూల్ మార్చిలోనే పూర్తైంది.ఆ తర్వాత కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో తాజాగా కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది మధ్య చిత్రీకరణ జరుపుతున్నారు.