ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టింది చిత్ర యూనిట్.అయితే ఈ సినిమాలో భాగంగా వచ్చే ఒక సన్నివేశంలో కోర్టులో లాయర్ గా వాదిస్తాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సీన్ ని దర్శకుడు ఇప్పుడు చిత్రీకరిస్తున్నాడు. అయితే ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ సింగల్ టేక్ లో ఓ భారీ డైలాగ్ చెప్తాడని లేటెస్ట్ టాక్.గతంలో పవర్ స్టార్ చాలా సినిమాల్లో ఇటువంటి సింగిల్ టేక్ డైలాగ్స్ చెప్పడం మనం చూసాం. అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సింగిల్ టేక్ డైలాగ్ చెప్పబోతున్నాడు అనే విషయం తెలుసుకున్న వారి అభిమానులు... సినిమాలో ఈ డైలాగ్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఊహించుకుంటున్నారు.