చిరంజీవితో సినిమా చేసిన తర్వాత కుర్రహీరోలెవరూ తమన్నావైపు చూడలేదు. అటు మహేష్ బాబు సరసన ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన తమన్నా.. ఆ తర్వాత ఆయన సినిమాలోనే ఐటం సాంగ్ కి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఇటీవల కొవిడ్ తో పోరాడి గెలిచిన తమన్నా.. ఇప్పుడు ఫ్రెష్ గా వెబ్ సిరీస్ లతో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది. 11th అవర్ అనే టైటిల్ తో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న వెబ్ సిరీస్ లో తమన్నా నటిస్తోంది. ఆహా లో వచ్చే ఈ వెబ్ సిరీస్ తమన్నాకి సరికొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు.