మెగా హీరోలు ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. 'ఖైదీ నెం. 150' రీమేక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. రెండు రీమేక్ సినిమాలను లైన్లో పెట్టాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సినిమా 'వేదలమ్' ని రీమేక్ చేయబోతున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీ ఎంట్రీ మూవీగా రీమేక్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. హిందీ హిట్ 'పింక్' సినిమాని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో తెరకెక్కిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అలానే రామ్ చరణ్ మలయాళ 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ పై రూపొందనున్న ఈ చిత్రంలో ఎవరు నటిస్తారో చూడాలి.  అలానే 'ధృవ' కి సీక్వెల్ గా మరో రీమేక్ ఉండబోతోందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇలా మెగా హీరోల నుంచి అర డజను రీమేక్ లు వస్తుండగా.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఓ రీమేక్ సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.కాగా అల్లు అర్జున్ బాలీవుడ్ హిట్ సినిమా ''సోనూ కె టిటూ కీ స్వీటీ'' ని రీమేక్ చెయ్యాలనుకుంటున్నాడట.