వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సెట్లో పవన్ అడుగు పెట్టకముందే క్రిష్ మూవీలో చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వకీల్ సినిమా పవన్ పూర్తి చేస్తున్నాడు. ఈ మధ్యలోకి ఎంటరయ్యింది మలయాళ మూవీ అయినటువంటి 'అయ్యప్పన్ కోషియుమ్.' ఇక ఈ సినిమాను రీమేక్ చేసేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. వకీల్ సాబ్ పూర్తి అవ్వడమే ఆలస్యం కేవలం 2 నెలల్లోనే అయ్యప్పన్ రీమేక్ ను పూర్తి చేసేందుకు పవన్ డేట్లు ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.