. ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం `సామ్ జామ్` పేరుతో ఓ స్పెషల్ టాక్ షోను హోస్ట్ చేస్తోంది.ఈ టాక్ షో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో జరగనుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూ చేయనుంది సమంత.ఇప్పటికే ఈ కార్యక్రమం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.  సిల్వర్ కలర్ సూట్‌తో స్టైలిష్‌గా ఉన్న విజయ్ ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. త్వరలో మరింత మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుంది.ఇక ఈ టాక్ షో లోని మొదటి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.