కరోనా కారణంగా పెద్ద హీరోలందరూ సినిమాలను తిరిగి స్టార్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్న సమయంలో.. కింగ్ అక్కినేని నాగార్జున డేరింగ్ గా సెట్స్ లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో స్టార్ హీరోలందరూ ఒక్కొక్కరుగా సెట్స్ లో అడుగుపెడుతూ వస్తున్నారు.ఇప్పటికే స్టార్ హీరోలైన ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - రవితేజ - పవన్ కళ్యాణ్ వంటి హీరోలు షూటింగ్ లో పాల్గొంటున్నారు.  అలానే సీనియర్ హీరో వెంకటేష్ సైతం షూటింగ్ రీస్టార్ట్ చేశాడు. ఇక నందమూరి బాలకృష్ణ దీపావళి తర్వాత సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. అల్లు అర్జున్ కూడా షూట్ లొకేషన్స్ కి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ కరోనా దుమారం రేగడంతో పెద్ద హీరోలంతా మళ్లీ షూటింగ్స్ కి దూరమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా షూటింగ్ లో నవంబర్ 9 నుంచి పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. షూటింగ్ ప్రారంభించాలనే ఉద్దేశ్యంలో చిరు కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఈ మధ్య సజావుగా షూటింగ్ జరుపుకుంటున్న యూనిట్స్ సైతం కలవరపడుతున్నారని తెలుస్తోంది.  చిరంజీవికి కరోనా సోకిందనే విషయం తెలియడంతో చాలా మంది అగ్ర హీరోలు సాధ్యమైనంత త్వరగా ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్స్ ముగించుకొని.. బయటపడాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం