ఓ వైపు బాలయ్య తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీలు కుదరినప్పుడల్లా మనవళ్లతో ఆడుకోవడం ఎంతో ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వారితో సమయం గడుపుతుంటాడు. అంతేకాదు వారితో కలిసి అల్లరి చేస్తుంటాడు. అయితే బాలయ్య ఇద్దరూ మనవళ్లు. బాలయ్య తాజాగా తన ముద్దుల మనవడితో సరదాగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో బాలయ్య తన చిన్న కూతురు తేజస్విని కుమారుడితో సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం ఇటు ఆయన అభిమానులను, అటు నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.