మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లిన కాజల్... భర్తతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తూనే.అక్కడ గడుపుతున్న ప్రతి క్షణంను కూడా ఆస్వాదిస్తున్నట్లుగా చాలా అందంగా ఆనందంగా కాజల్ కనిపిస్తుంది.  కాజల్ అందమైన రూపంను గౌతమ్ ఎప్పటికప్పుడు తన కెమెరాలో బంధిస్తూ ఉన్నాడు. తాజాగా కాజల్ చాలా ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. మల్దీవుల అందాలను తన ఫాలోవర్స్ కు చూపిస్తూ వావ్ అనిపిస్తున్న కాజల్ ఈసారి వర్కౌట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపర్చింది.బ్లూ సీ ఒడ్డున బ్లూ డ్రస్ లో అందంగా ఉన్న కాజల్ ఇలా ఆసనాలు వేసి అందరిని ఆశ్చర్యపర్చింది. కాలి వేళ్లపై చేతులను వెనక్కు వంచి పూర్తిగా బెండ్ అయ్యింది. పెళ్లి చేసుకుని హనీమూన్ కు వెళ్లిన కాజల్ ఏంటీ ఇలాంటి ఆసనాలు అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి భంగిమ వేయడం అంటే మామూలు విషయం కాదు.