గతంలో కమల్ హాసన్ సినిమా అంటే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండేది. కమల్ మూవీస్ ని ఒకేసారి మూడు నాలుగు భాషల్లో తెరకెక్కించేవారు. ఆయన సినిమాలకోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడేవారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు కమల్ హాసన్ సినిమా అంటేనే అసలు పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం భారతీయుడు-2 ఆగిపోయే దశలో ఉందని కోలీవుడ్ సమాచారం. కమల్ హాసన్ తో అంత బడ్జెట్ రిస్క్ చేయలేక నిర్మాణ సంస్థ ఆగిపోయిందని, దీంతో దర్శకుడు శంకర్ కూడా కమల్ ని వదిలేసి, కేజీఎఫ్ హీరో యశ్ తో సినిమాకు రెడీ అయ్యారని అంటున్నారు.