రెండు రోజుల క్రితం ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా మలయాళ భామ ప్రయాగ మార్టిన్ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. మళ్ళీ ఏమైందో ఏమో.. ఈ అమ్మడని కాస్త ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు.అయితే బోయపాటి ఈమెను ఎందుకు తప్పించాడో అనే సందేహం మాత్రం అభిమానుల్లో ఇప్పటికీ అలానే ఉంది. అయితే బాలకృష్ణ సరసన సెట్ అవ్వడం లేదనే కారణంతో బోయపాటి ప్రయాగమార్టిన్ ను పక్కకు పెట్టాడని వార్తలు వచ్చాయి.  అయితే ప్రయాగ మార్టిన్ ను ప్రాజెక్టులోకి తీసుకున్నట్టే తీసుకొని..మళ్లీ వెనక్కి నెట్టడానికి కారణం వేరే ఉందట.ఓ ఇంటర్వ్యూలో నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి మాట్లాడుతూ..మలయాళం సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల ప్రయాగ వెంటనే సినిమా షూటింగ్ లో చేరే అవకాశం లేదు. ప్రయాగ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు చెప్పారు.