లాక్ డౌన్ తర్వాత ఆచార్య తీరా సెట్స్ పైకి వెళ్లే దశలో చిరంజీవికి కరోనా సోకడంతో అందరూ ఆందోళన పడ్డారు. తిరిగి ఆచార్య ఎప్పుడు మొదలవుతుందా అని ఆలోచనలో పడ్డారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ కూడా ఆచార్య పురోగతిపై ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి మాత్రం దర్శకుడు కొరటాల శివకు ఆయనకు అభయహస్తం ఇచ్చేశారు. తన క్వారంటైన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఆ తర్వాతి రోజునుంచే షూటింగ్ పెట్టుకోవాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారట.