ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభించే దశలో చిరంజీవి కరోనా బారిన పడటంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలకరం రేగింది. సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్ సజావుగా సాగిపోతున్నా కూడా అందరిలో ఏదొ ఒక అనుమానం. ఎక్కడ తిరిగి కరోనా దాడి చేస్తోందో, ఎవరికి తిరిగి కరోనా సోకుతుందోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ అంటూ ప్రచారం జరగడం కూడా దీనికి మరో కారణం. ఇతర దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ వచ్చేసిందని, రెండో దఫా కరోనా సోకినవాళ్లు, తొలిదశలో సోకినా తెలియకుండానే తగ్గిపోయి, రెండోసారి అటాక్ అయినవారు ఇబ్బంది పడతారనే ప్రచారం జరుగుతుండటంతో అందరూ ఆందోళన పడుతున్నారు.