ప్రస్తుతం బన్నీ 'పుష్ప' సినిమా షూటింగ్ ఇటీవలె తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో విలన్గా ఎవరు కనిపించబోతున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.తొలుత ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ ప్రముఖ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే డేట్లు ఖాళీ లేకపోవడం వల్ల ఈ సినిమా నుంచి విజయ్ తప్పుకున్నాడు. విజయ్ తప్పుకోవడంతో తమిళ నటుడు బాబి సింహ పేరు వినిపించింది. అయితే తాజాగా మరో తమిళ నటుడి పేరు తెర మీదకు వచ్చింది. బన్నీ గతంలో నటించిన `వరుడు` సినిమాలో విలన్గా కనిపించిన ఆర్యను `పుష్ప`లో ప్రతినాయకుడి పాత్రకు తీసుకున్నట్టు తాజా సమాచారం. `వరుడు` మాత్రమే కాదు.. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా ఆర్య తెలుగు వారికి బాగా పరిచయం. అందుకే ఆర్య వైపు యూనిట్ మొగ్గు చూపుతోందట.