నవంబర్ 13వ తేదీన ప్రారంభం కానున్న సామ్ జామ్  షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోకు సంబంధించిన తొలి ఎపిసోడ్‌కు విజయ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. విజయ్ దేవరకొండ, సమంత మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందంటే.. తొలి ఎపిసోడ్లో సమంత స్టెప్పులు వేస్తూ.. పాటలు పాడుతూ.. ఇతర టీమ్ మెంబర్స్‌తో కలిసి విజయ్ దేవరకొండను ఆహ్వానించారు.సామ్ జామ్ షో కోసం స్టేజ్‌పైకి వచ్చిన విజయ్ దేవరకొండ హంగామా చేశాడు. తన అఫైర్స్ గురించి విషయాలను ఓపెన్‌గా బయటపెట్టాడు. తనకు అఫైర్లు లేవని చెబుతూ సింగిల్ అని రాసి గ్లాస్ ప్లేట్‌పై సుత్తితో గట్టిగా కొట్టి తన ఇంటెన్షన్‌ను బయటపెట్టారు. ఇక తాను తీసుకొనే నిర్ణయాలు అసాధారణంగా ఉంటాయనే విషయాన్ని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. సినీ అభిమానుల్లో తనకు ఉన్న రెబెల్ యాటిట్యూడ్‌ను ఒప్పుకొన్నారు. తాను రెబెల్ అంటూ అది రాసిన ప్లేట్‌ను పగలకొట్టారు. సమంతతో కలిసి చాలా విషయాలు పంచుకొన్నారు.