పవన్ కళ్యాణ్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.  మలయాళం హిట్టు సినిమా అయ్యప్పన్ కొశీయుమ్ రీమేక్ కు దర్శక నిర్మాతలు చాలా పవర్ఫుల్ గా రెడీ అవుతున్నారు.సినిమాను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేయాలని పవన్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడు. దీంతో పక్కా ప్లాన్ తో షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు దర్శకుడు సాగర్ చంద్ర.సినిమాలో మరో హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోలీస్ పాత్రలో పవన్ నటిస్తున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌజ్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరో హీరో పాత్రపై మాత్రం కొంచెం కూడా క్లారిటీ ఇవ్వలేదు. నితిన్, సాయి ధరమ్ తేజ్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి గాని ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. .అయితే ఫైనల్ గా రానా ఫిక్స్ అయ్యేలా ఉన్నాడని తెలుస్తోంది.