సుధీర్ బాబు తో ఇప్పటికి రెండు సినిమాలు చేసారు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. గతంలో ఇంద్రగంటి తీసిన సమ్మోహనం, వి సినిమాలు రెండింటిలో సుధీర్ బాబు నటించాడు. మళ్లీ మరోసారి అదే కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నారు. వాస్తవానికి వి సినిమా తరువాత ఇంద్రగంటి నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. అది పాత కమిట్ మెంట్. అయితే వి సినిమా రిజల్ట్ తో నాగ చైతన్య వెనకడుగు వేశారని సమాచారం. ఈలోగా సుధీర్ బాబు లైన్లోకి వచ్చారు. దీంతో సుధీర్ తో ఓ కథను ఫైనలైజ్ చేసిన ఇంద్రగంటి, దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధపడ్డారట.