కరోనా లాక్ డౌన్ వల్ల అటు షూటింగ్ లు ఆగిపోయి, ఇటు రిలీజ్ లు ఆగిపోయి.. నిర్మాతలు చాలా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో రాబోయే సినిమాలపై భారీ బడ్జెట్ పెట్టలేమని కూడా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లపై కూడా టాలీవుడ్ లో చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మాంచి రైజింగ్ లో ఉన్న ఓ హీరోయిన్ మాత్రం పారితోషికం విషయంలో మొహమాటం లేకుండా నిర్మాతలకు తన డిమాండ్ వినిపిస్తోందట. 2కోట్ల రూపాయలకు ఏమాత్రం తగ్గినా సినిమాకి సైన్ చేయను పొమ్మంటోందట.