ఈ మధ్య ఆ తెలుగు హీరోయిన్ కి కరోనా సోకింది. పూర్తి చికిత్స తర్వాత ఇటీవలే కోలుకుని తిరిగి షూటింగ్ లకు హాజరవుతోంది. అయితే కరోనా వల్ల ఆమె ఓ జీవిత సత్యాన్ని తెలుసుకుంది. అప్పటి వరకూ సినిమా అవకాశాలకోసం, ఇతర హీరోయిన్లతో ఉన్న కాంపిటీషన్ వల్ల.. పూర్తి స్థాయిలో డైట్ ప్లాన్స్ పాటించింది. నాజూగ్గా కనిపించడంకోసం ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టింది. అయితే కరోనా వల్ల ఆమెకు అసలు నిజం తెలిసొచ్చింది. డైటింగ్ తో బరువు తగ్గడం కోసం ఆరోగ్యాన్ని త్యాగం చేయకూడదని అంటోంది. సినిమా అవకాశాలకోసం ఇప్పటి వరకూ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని, నాజూగ్గా ఉండటంతోపాటు.. ఫిట్ గా ఉండాలని, రోగ నిరోధక శక్తి ఉంటేనే దేన్నయినా తట్టుకోగలం అని ఇప్పుడు జీవిత సత్యాలు చెబుతోంది.