తాజాగా ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేలోపు మహేష్ సినిమా పూర్తిచేస్తానంటు త్రివిక్రమ్ ఎన్టీఆర్ ముందు ప్రపొజల్ పెట్టినట్లు తెలుస్తోంది.కానీ అందుకు ఎన్టీఆర్ గట్టిగానే నో చెప్పినట్లు ఫిలింనగర్ వర్గాలంటున్నాయి.  తన కోసం ఈ ఏడాది ఆగాలని, వచ్చే ఫిబ్రవరి వరకు ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసుకుంటామని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక త్రివిక్రమ్ వెనక్కి వచ్చేశారు.దీన్ని బట్టి ఎన్టీఆర్ మాటకి త్రివిక్రమ్ ఎంత విలువ ఇస్తాడో అర్ధం అవుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుందట.