పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిటయ్యాడు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది.   కాని ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. క్రిష్ తెలివిగా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పవన్ లేకుండానే పూర్తి చేశాడు. పవన్ బల్క్ డేట్ల కోసం ఎదురు చూడకుండా రెండు మూడు రోజులు టైం ఇచ్చినా కూడా వెంటనే ఆయన సింగిల్ షాట్స్ ను మరియు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు రెండు వారాల సమయం ఉండటంతో ఆ టైమ్ ను తనకు ఇవ్వాలంటూ క్రిష్ విజ్ఞప్తి చేశాడట. రెండు వారాల్లో ఏం చేస్తారు.ఒకేసారి పూర్తి చేసేందుకు ఫిబ్రవరి లేదా మార్చిలో చేద్దాం అన్నాడట. కాని క్రిష్ మాత్రం అప్పటి వరకు వెయిట్ చేయడం వృదా పవన్ కు వీలున్నప్పుడు సినిమాను ముగించేద్దాం అన్నట్లుగా వచ్చే నెలలో ఎన్ని రోజులు వీలు అయితే అన్ని రోజుల డేట్లను ఇవ్వమంటూ కోరాడట.  అందుకు పవన్ కూడా ఒప్పుకోవడంతో షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.