ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి తిరిగి మొదలైంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకోవడంతో ఆమె దర్శకుడి వద్ద పర్మిషన్ తీసుకుని హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంది. ఇంతలోనే.. ఆచార్య షూటింగ్ తిరిగి మొదలు పెట్టాలనుకున్న దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ కాజల్ లేకుండానే సీన్లు రెడీ చేసుకున్నారు. అయితే అంతలోనే చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కూడా లేకుండా తన పని పూర్తి చేస్తున్నారు. చిరంజీవి పాజిటివ్ వార్త కాస్తా నెగెటివ్ అని మారిపోయింది. కిట్ లో లోపం వల్ల సరిగా పరీక్ష జరగలేదని, అందుకే చిరంజీవికి తప్పు రిపోర్ట్ అందిందని తెలిసింది. దీంతో చిరంజీవి కూడా షూటింగ్ కి హాజరవబోతున్నారు.