అందంతో సంబంధం లేకుండా.. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా.. తమకు సంథింగ్ స్పెషల్ గా ఉండేవారే పార్టనర్ కావాలని కోరుకుంటారు. సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అలాంటి సంథింగ్ స్పెషల్ వ్యక్తినే తన జీవిత భాగస్వామిగా చేసుకుంటానని చెబుతోంది హీరోయిన్ రాశీ ఖన్నా. ఇప్పటి వరకూ అలాంటి స్పెషల్ పర్సన్ ఎవరూ తన జీవితంలోకి రాలేదని, అలాంటి వ్యక్తి వస్తే కచ్చితంగా అతనితో డేటింగ్ వెళ్తానని కూడా అంటోంది ఈ అమ్మడు. ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని తేల్చి చెప్పింది.